44 మంది పిల్లలు కన్నది.. ఆ త‌ర్వాత..

-

సాధాన‌ణంగా ఈ రోజుల్లో ఒకరిద్దరు పిల్లలతో వేగడం కష్టం అయిపోతుంది. అలాంటిది ఆమె ఏకంగా 40 ఏళ్లలో నలబైనాలుగు మంది పిల్లలకు తల్లిగా మారింది. ఆశ్య‌ర్యంగా ఉన్నా.. నిజంగా ఇదీ నిజమే. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియంకు 44 మంది పిల్లలకు జన్మనించ్చింది. వాస్తవానికి ఆమె అరుదైనా అండాశయం ఉంది. మరియంకు తన 12 ఏళ్లకే వివాహం జరిగింది. మరియంకు 13 ఏట కవలలుజన్మించారు. కవలలు చాలు అనుకొని ఆమె వైద్యులను సంప్రదించింది. తనకు గర్భం తీసేయాలని కోరింది. మరియంను పరీక్షించిన వైద్యులు కష్టమని చెప్పారు. గర్భాశయంలో అండాలు విడుదల వల్ల మరింయంకు ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు జన్మించారు.

భవిష్యత్తులో ఎక్కువ మంది కవలలు పుట్టే అవకాశం ఉందని తెలిపారు. తన సమస్యకు పరిష్కారం చూపలేక వైద్యులు కూడా చేతులేత్తేశారు. దీంతో మరియంకు గర్భం దాల్చిన ప్రతీసారి ఇద్దరూ నుంచి నలుగురు కవల పిల్లలలు జన్మిస్తున్నారు. దీంతో ఆమె భర్త విడాకులు తీసుకున్నాడు. మరియంకు పుట్టిన పిల్లల్లో కొందరు పుట్టగానే చనిపోయారు. దీంతో ఇప్పుడు ఆమెకు 38మంది పిల్లలు మాత్రమే జీవించి ఉన్నారు. మరియం తన పిల్లలను ఆమె చాలా బాగా చూసుకుంటుంది. కానీ పిల్లలను పోషించడానికి ఆమె పడే క‌ష్టం వర్ణాతీతం. మరియం పరిస్థితి చూసి ఉగాండా ప్రభుత్వం ఆదుకోడానికి ముందుకొచ్చింది. పిల్లలను కనడం ఆపాలంటూ షరతు విధించింది. మరియం గర్భాశయాన్ని తొలగించాలని వైద్యులకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version