ఇటువంటి విషయాల్లో మౌనమే మంచిది.. లేదంటే చిక్కుల్లో పడతారు..!

-

కొంతమంది అతిగా మాట్లాడుతుంటారు. దాని వలన ఇతరులకి ఇబ్బంది తప్ప ఉపయోగమేమీ లేదు. అతిగా మాట్లాడి ఆఖరికి ఛీ కొట్టించుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో కొందరు సైలెంట్ గా ఉండటం మంచిది. ఎప్పుడైనా సందర్భంలో పూర్తిగా తెలియనప్పుడు సైలెంట్ గా ఉండాలి. లేదంటే ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. బాగా ఎమోషనల్ అయినప్పుడు కూడా సైలెంట్ గా ఉండటమే మంచిది. విపరీతమైన భావోద్వేగంతో ఉన్నట్లయితే సైలెంట్ గా ఉండండి. అలాగే ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో స్నేహితులతో గొడవ పడాల్సి వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉండండి. లేదంటే స్నేహం బ్రేక్ అవుతుంది.


కొంతమంది వెక్కిరిస్తూ మాట్లాడుతూ ఉంటారు అలాంటి అలవాటు మీకు కూడా ఉంటే సైలెంట్ గా ఉండడం మంచిది. అనవసరంగా మీ పేరుని పాడు చేసుకుంటారు కోపంగా ఉన్నప్పుడు కూడా సైలెంట్ గా ఉండిపోవడమే మంచిది. అదే విధంగా మీరు మాట్లాడితే మీ బంధం దెబ్బతింటుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సైలెంట్ గా ఉండాలి. లేదంటే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎప్పుడైనా ఎవరైనా నేరం చేస్తున్నట్లయితే నేరం చేసిన వ్యక్తిని సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే సైలెంట్ గా ఉండండి. నేరం పరిధిని పరిగణలోకి తీసుకొని మీరు ప్రవర్తించాలి. ఒకవేళ కనుక నేరం పెద్దదైతే కచ్చితంగా చెప్పాలి. ఇంటి విషయాలని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పొద్దు. ముఖ్యంగా భార్యతో లేదా భర్తతో జరిగే గొడవల గురించి ఇతరులకు చెప్పడం వలన మీరు రిలేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి విషయాలని మాట్లాడొద్దు. మీ మూడ్ బాగోలేనప్పుడు కూడా మాట్లాడొద్దు. ఇలా కనుక మీరు ఈ విషయాల్లో సైలెంట్ గా ఉన్నారంటే ఏ సమస్య రాకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version