ఆ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు బికినీలు వేసుకుంటారు..!

-

అవును.. షాక్ అయ్యారా? అసలే… ఎక్కువ కాంపిటీషన్. ఎవరైనా ఏం చేస్తారు. ఈ ఎయిర్ లైన్స్ వాళ్లు కొత్త పద్ధతిని కనిపెట్టారు. ప్రయాణికులను ఆకర్షించడానికి ఏకంగా ఎయిర్ హోస్టెస్ లకు బికినీలు వేయిస్తారు. ఇదో కొత్త ప్రయోగం అన్నమాట. వియత్నాంకు చెందిన వియత్ జెట్ ఎయిర్ లైన్స్ అనే సంస్థ ఈ ప్రయోగానికి తెర తీసింది.

విమానంలో ఎంత సేపు ప్రయాణం చేసినా ప్రయాణికులకు అస్సలు బోరే కొట్టదు. ప్రయాణికులు కూడా బికినీలు వేసుకున్న ఎయిర్ హోస్టెస్ ల ఆతిథ్యానికి ఫిదా అయిపోతున్నారట. అందుకే.. ఈ ఎయిర్ లైన్స్ కు లోకాస్ట్ బికినీ ఎయిర్ లైన్ అనే పేరు కూడా వచ్చింది.

ఇక.. ఈ ఎయిర్ లైన్స్ సంస్థ విమానాల్లో కేవలం బికినీలు వేసుకున్న ఎయిర్ హోస్టెస్ ల కోసమే కొంతమంది ప్రయాణాలు చేస్తుంటారట. ఆ విమానాల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు పోటీ పడుతున్నారు. మూడు నాలుగు నెలల ముందే టికెట్లు బుక్కయిపోతున్నాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ఎయిర్ లైన్స్ త్వరలోనే ఇండియాలో కూడా తన సర్వీసులను ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ సంస్థ 23 డొమెస్టిక్, 10 ఇంటర్నేషనల్ రూట్లలో సేవలు అందిస్తోంది.

అయితే.. బికినీ ఎయిర్ హోస్టెస్ ల వల్ల కంపెనీకి చాలా సమస్యలే వచ్చాయి. కానీ.. కంపెనీని నిలబెట్టాలంటే ఇటువంటి టాక్టిక్స్ తప్పవని నమ్మిన కంపెనీ.. ఆ పనిని మాత్రం వదలట్లేదు. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి కూడా మహిళే. చూశారా.. ఒక్క ఐడియా ఆ విమానయాన సంస్థను ఎక్కడికి తీసుకుపోయిందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version