నదిని తవ్వుతున్న స్థానికులు…! కారణం ఏమిటంటే…?

-

ఈ ఊరి జనం ఏకంగా నదిని తవ్వేస్తున్నారు. దీనిని చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఆ నదిని తవ్వేస్తున్నారు..? చూశారంటే ఆశ్చర్యపోతారు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్‌ లో జరిగింది. ఎనిమిది రోజుల క్రితం కొంత మంది మత్స్యకారులకు రాజ్‌ఘర్ జిల్లా లోని పార్వతి నది లో బంగారు, వెండి నాణాలు లభించాయి అని వార్త వచ్చింది. ఈ విషయం స్థానికంగా ఉండే అందరికీ తెలిసింది.

river
river

దీనితో ఇక్కడ బంగారం, వెండి నాణాలు లభ్యమవుతున్నాయని ఒక పుకారు నలు మూలల వ్యాపించింది. అంతే ఇంకేముంది. ఈ వార్త దావానంలా వ్యాపించడం తో ప్రజలు ఈ నాణాలు దొరికేస్తాయని ఆశ తో పరుగులు తీశారు. ఇలా మొత్తం అందరు నది లో నాణాల కోసం గాలింపు చేపట్టారు. ఇది ఇలా ఉంటే అక్కడక్కడ తవ్వకాలు కూడా జరిపారు. గత కొన్ని రోజుల క్రితం నాణాలు దొరికాయి అనే వార్త వల్లే ఇలా జరుగుతోంది.

రాజ్‌ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్‌పూరా గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకుని నాణేల కోసం వేట ప్రారంభించారు. అయితే నీళ్లలోకి దిగి బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం కొందరు వెతుకుతుండగా ఒడ్డునే ఉన్న బురద పెల్లలను తొలగిస్తూ మరి కొందరు వెతుకుతున్నారు. మత్సకారులకి వెండి, బంగారం నాణాలు దొరికాయి అని స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news