ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మార్పులు చేసుకుని తిరిగి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని రకాల సమస్యలు ఇతరుల ముందు ఇబ్బంది పడేలా చేస్తాయి. వాటిలో ఒకటి నోటి దుర్వాసన. నోటి దుర్వాసన ఎక్కువగా ఉండటం వలన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు కొన్ని రకాల మార్పులను చేసుకోవడం వలన నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. అసలు నోటి దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా దంతాలను శుభ్రం చేయడంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు, చిగుళ్లలో వాపు లేక రక్తస్రావం, నాలుకను సరిగ్గా శుభ్రం చేయకపోవడం మరియు నోరు పొడిబారడం వలన నోటి దుర్వాసన సమస్య ఎదురవుతుంది. అయితే ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పకుండా కొన్ని చిట్కాలను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. నోటి దుర్వాసనకు అల్లం రసం ఎంతో పని చేస్తుంది అనే చెప్పవచ్చు. అల్లం రసాన్ని తాగడం వలన ఎంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. నోటి దుర్వాసనకు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ అల్లం వేసి బాగా మరిగించి చల్లార్చాలి. ఈ నీటితో రోజుకు మూడుసార్లు నోటిని కడగడం వలన నోటి దుర్వాసన ఎంతో తగ్గుతుంది.
చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత సోంపును తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ముఖ్యంగా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసిన తర్వాత కూడా సోంప్ ను తినడం వలన జీర్ణవ్యవస్థకు సహాయం చేయడంతో పాటుగా మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. దీంతో దుర్వాసన రాకుండా ఉంటుంది. నోటి దుర్వాసనను తగ్గించడానికి తులసి ఆకులు, పుదీనా ఆకులు కూడా ఎంతో పని చేస్తాయి. ఈ ఆకులను గ్రైండ్ చేసి నీటిలో కరిగించాలి, ఈ నీటితో నోటిని కడగడం వలన ఎంతో మార్పుని గమనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడుసార్లు చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది.