సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎన్నో అందమైన వీడియో లను నిత్యం వీక్షిస్తూ ఉంటాం. ముఖ్యంగా అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఎక్కువగా వాడుకలో ఉండే ట్విట్టర్ అయితే నిత్యం ఏదోక అందమైన వీడియోని మనకి అందిస్తూనే ఉంటుంది. తాజాగా “అసలు క్యాట్‌వాక్” అనే శీర్షికతో,
రహదారిపై సింహాలు అన్నీ కలిసి నడుస్తున్న ఒక భయంకరమైన తొమ్మిది సెకన్ల క్లిప్‌ను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పంచుకున్నారు. దాదాపు 40 నుంచి 50 సింహాలు అన్నీ రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి. వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు ముందు దీనిని గ్రాఫిక్స్ అనుకున్నారు. అన్ని సింహాలు ఏ విధంగా నడుస్తాయని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన నందా 45 సెకన్ల నిడివి గల పూర్తి వీడియో తన వద్ద ఉందని, ఆయన పోస్ట్ చేసారు. సింహాలలో ఒకటి కారుకు చాలా దగ్గరగా వచ్చి నేరుగా కెమెరాలోకి కనిపించే క్లిప్ ఈ వీడియోలో హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దమ్ముంటే ఆ రోడ్ మీదకు బైక్ లేదా, సైకిల్ వేసుకుని ఒంటరిగా వెళ్ళే సాహస౦ చెయ్యాలి అంటూ పలువురు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
The original cat walk ?? pic.twitter.com/tpOEYuezum
— Susanta Nanda IFS (@susantananda3) January 23, 2020
— Susanta Nanda IFS (@susantananda3) January 23, 2020