వైరల్ వీడియో; ఎవరూ లేని సమయం చూసి స్విమ్మింగ్ ఫూల్ లో దూకిన కోతి…!

-

కరోనా వైరస్ పుణ్యమా అని జనాలు బయటకు రాకపోవడం తో ఇప్పుడు జంతువులదే రాజ్య౦ అయిపోయింది. చాలా ప్రాంతాల్లో అడవి జంతువు రోడ్ల మీదకు వచ్చి సందడి చేస్తున్న వీడియో లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక కోతి స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ వీడియోలే వైరల్ అవుతున్నాయి.

ముంబైలోని బోరివాలిలో కోతులు పూల్ పార్టీ చేసుకుంటున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో టిస్కా చోప్రా అనే వ్యక్తి షేర్ చేసారు. “#PoolParty అనే టాగ్ తో ఈ వీడియో ని తప్పక చూడండి అనే ట్యాగ్ తో పోస్ట్ చేసారు. అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోతి ఇదే సరైన సమయం అనుకుని స్విమ్మింగ్ ఫూల్ లో దూకింది అని పేర్కొన్నారు.

క్లిప్‌లో, ఒక కోతి బాల్కనీ రైలింగ్‌పై కూర్చున్నప్పుడు, మరొకటి ఇంటి కిటికీలో సరదాగా గడిపినట్లు ఉంటుంది. అకస్మాత్తుగా అది ఊగుతూ తరువాత ఈత కొలనులోకి దూకుతుంది. దూకిన తర్వాత కోతి అప్పుడు తీరికగా ఈత కొట్టి, అనంతరం ఒక మూలకు వెళ్లి కూర్చుని సేద తీరుతుంది. పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే ఈ వీడియో… లక్ష మంది వీక్షించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news