మనిషి రక్తం తాగేస్తున్న మహిళ.. వారానికి 36 లీటర్లు కతమ్‌

-

మటన్‌ బ్లడ్‌, మటన్‌ హెడ్‌ అందరూ తింటారు.. ఇంకా ఇవి టేస్టీగా కూడా ఉంటాయి.. కానీ మనిషి బ్లడ్‌ ఎవడైనా తాగుతాడా..? అలా చేస్తే వాళ్లను మనుషులు అనరు.. రాక్షసులు అంటారు కదా..! మనిషి రక్తం ఎవ్వరూ తాగరు.. అసలు ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది..కానీ ఓ లేడీ వారానికి 36 లీటర్ల మనిషి రక్తం తాగుతుందట..! అసలు ఒక్కో మనిషికి ఉండేదే దాదాపు 5 లీటర్ల రక్తం.. ఆమె వారానికి అన్ని లీటర్లు తాగేస్తుంటే.. ఎంత మంది బ్లడ్‌ను వాడుతుందో..! అసలు ఎవరీమే..? ఎందుకు ఇలా మనిషి రత్తం తాగేస్తుంది..?

ఆమె అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి. వయస్సు 40 సంవత్సరాలు. ఆమె పేరు మిచెల్. ఆమె టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. చాలా ఏళ్లుగా రక్తం తాగే అలవాటు ఉంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిచెల్.. తనకు మనుషుల రక్తం తాగే అలవాటు ఉందని చెప్పింది..మనుషుల రక్తం అంటే ఇష్టం. కాబట్టి నేను దానిని వినియోగిస్తున్నాను అని చెప్పింది. మిచెల్ జంతువుల రక్తంతో పాటు మానవ రక్తాన్ని కూడా తాగడానికి ఇష్టపడుతుంది. కేవలం ఒక వారంలో ఆమె దాదాపు 36 లీటర్ల రక్తం తాగుతుంది.

మిచెల్‌కు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె డిప్రెషన్‌తో బాధపడింది. ఆ సమయంలో మిచెల్ ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆమె తనను తాను గాయపరచుకుంది. ఒకరోజు ఆమె చెయ్యి కోసుకుంది. చేతికి రక్తం కారుతోంది. అప్పుడు ఆమె ఆ రక్తాన్ని తాగేసిందట.. ఆ రుచి తనకు నచ్చిందట.. ఆ తర్వాత రక్తం తాగే అలవాటు మొదలైంది. అప్పటి నుంచి ఆమె ఈ పద్ధతిని కొనసాగిస్తోంది.

తనను అందరూ రాక్షసి, పిశాచి అని భావిస్తారని ఆమె అంటోంది..మిచెల్ జంతు రక్తం తాగే వ్యక్తి అయినప్పటికీ, ఆమె మానవ రక్తాన్ని ఇష్టపడుతుంది. మిచెల్ ఒక టీవీ కార్యక్రమంలో కనిపించి.. తన అభిరుచుల గురించి చెప్పిన తర్వాత.. అమెరికాలో కొన్ని నియమాలు కఠినతరం చేయబడ్డాయి. ఈ కారణంగా, మానవ రక్తాన్ని సులభంగా పొందలేరు. దీన్ని తాగడం మరింత కష్టమని మిచెల్ చెప్పింది. మిచెల్ రక్తం తాగే అలవాటుతో బాగా పేరు పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news