గర్భిణీగా ఉంటూనే.. మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. అరుదైన కేసు..!

-

ఒకసారి గర్భం దాల్చిచే బిడ్డ పుట్టే వరకూ మళ్లీ కన్సీవ్‌ అవ్వరూ. లేదా ఒకేసారి కవలలకు జన్మనిస్తారు. కానీ గర్భిణీగా ఉంటూనే మళ్లీ గర్భం దాల్చడం మీరు ఎక్కడైనా విన్నారా.. ఈ అరుదైన ఘటన ఓ మహిళ జీవితంలో జరిగింది. ఆమె పేరు కారా విన్‌హోల్డ్ (Cara Winhold). వయసు 30 ఏళ్లు. ఆల్రెడీ ప్రెగ్నెంట్‌గా ఉంటూ… మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఫలితంగా ఆమె కవలలకు జన్మనిచ్చింది.

ఈ పరిస్థితిని సూపర్‌ఫెటేషన్ (superfetation) అంటారు. ఇదో అరుదైన ఘటన. ఇలాంటి కేసుల్లో ఆల్రెడీ ఓ అండం విడుదలై… గర్భం దాల్చుతారు. మళ్లీ.. అంతలోనే మరో అండం విడుదలవుతుంది. అందులోనూ గర్భం వస్తుంది. అంటే… ఒకే సమయంలో రెండు అండాల్లో ఇద్దరు పిల్లలు పెరుగుతారు. ఇలా ప్రపంచంలో 0.3 శాతం మంది మహిళలకు మాత్రమే అవుతుందట.. అయితే చాలా సందర్భాల్లో..రెండో గర్భంలోని బిడ్డ చనిపోతుంది. కారా.. కవలలకు జన్మనివ్వక ముందు.. 3 సార్లు గర్భం దాల్చినా ఫెయిలైందట. అలాంటిది ఏకంగా ఇప్పుడు కవలలు పుట్టారు.

డాక్టర్లు ఎప్పుడైతే.. తనలో రెండు అండాలు ఉన్నాయని.. కవలలు పుడతారని చెప్పారో..కారా ఆనందానికి అవథులు లేవు. భర్త షాక్‌లో ఉండిపోయారట. రిపోర్టుల ప్రకారం కారాకు 9 నెలల తర్వాత పాప కల్సన్ విన్‌హోల్డ్ పుట్టింది. వారం తర్వాత బాబు కేడెన్ పుట్టాడు. వాళ్లిద్దరూ కవలలు అని డాక్టర్లు తెలిపారు.

ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు..

2020లో రెబెక్కా రాబెర్ట్స్ (Rebecca Roberts) అనే మహిళకు కూడా ఇలాగే జరిగింది. ఆమెకు కూడా కొద్ది గ్యాప్‌లోనే రెండు గర్భాలు దాల్చింది. ఆమెకు ముందుగా బాబు నోవా పుట్టగా.. తర్వాత పాప రోసాలీ పుట్టింది.

ఒక బిడ్డ ఉన్నప్పుడే ఆ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది. రెండు గర్భాలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకోవాలి. చాలా యాక్టీవ్‌గా ఉండాలి. ఇలా జరగడమే అరుదు అంటే.. పుట్టిన బిడ్డల్లో ఇద్దరూ బతికే ఉండడం ఇంకా హైలెట్..!

Read more RELATED
Recommended to you

Exit mobile version