ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న బాలుడు.. 200 పౌండ్లు తగ్గాడు.. వీడియో

-

ఆ బాలుడి బరువు 400 పౌండ్లు. అంత బరువుతో కూర్చోవడం, లేవడం, నడవడం అంటే మనోడికి కత్తి మీద సామే. అందుకే.. ఎక్కువ బరువు వల్ల ఎప్పుడూ పడుకొనే ఉండేవాడు ఆ బాలుడు. 400 పౌండ్ల బరువుతో ఉన్న ఆ బాలుడు.. ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న బాలుడిగా గుర్తింపు పొందాడు. అయితే.. మనోడి బరువే మనోడికి శాపంగా మారింది. స్కూల్‌కు వెళ్లాలన్నా.. ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా సమస్యే. తన ఫ్రెండ్స్ ఆరుగురు తినే ఫుడ్‌ను ఈ బాలుడు ఒక్కడే తినేస్తాడు. అతడికి నూడుల్స్, చికెన్ రైస్, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అవి కనిపిస్తే చాలు వాటిని లొట్టలేసుకుంటూ తినేస్తాడు. అతడు అంత లావుగా మారడానికి ఆకలి ఎక్కువగా అవడం, తిండి ఎక్కువగా తినడం, తిన్న చోటే అలాగే కూర్చోవడం వల్ల బరువు పెరుగుతూ వచ్చాడు.

కానీ.. తర్వాత తనను కాపాడటం కోసం డాక్టర్లు సర్జరీ చేశారు. దీంతో 200 పౌండ్ల బరువు తగ్గాడు. ఇప్పుడు సాధారణ పిల్లల్లా తయారయ్యాడు ఆ బాలుడు. అందరిలా స్కూల్‌కు వెళ్తూ.. ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఐస్‌క్రీమ్స్, చికెన్ లాంటి వాటి జోలికి పోకుండా. కేవలం పళ్లు, కూరగాయలు మాత్రమే తింటూ బరువు పెరగకుండా కాపాడుకుంటున్నాడు. 400 పౌండ్ల బరువు నుంచి 200 పౌండ్ల బరువుకు మారాక ఆ పిల్లాడు ఎలా తయారయ్యాడో ఈ వీడియోలో చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version