కావాల్సినవి :
బటర్ : 100 గ్రా.
చక్కెర : 100 గ్రా.
బేకింగ్ పౌడర్ : 1 టీస్పూన్
వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ : అర టీస్పూన్
మైదాపిండి : 2 కప్పులు
వ్యాక్స్ పేపర్ : సరిపడా
ఫుడ్‌కలర్ : తగినంత
పాలు : అరకప్పు
కోడిగుడ్డు : 1
కర్జూరం : 23
నీళ్లు : తగినన్ని
తయారీ :
ఒక గిన్నెలో చక్కెర, బటర్, బేకింగ్ పౌడర్, వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. అందులోనే మైదాపిండి జతచేయాలి. ముద్దలా వచ్చేందుకు పాలు పోయాలి. రంగు వచ్చేందుకు ఫుడ్‌కలర్ కలపాలి. ఇలా రంగు కలపకుండా ఒక ముద్ద, రంగు కలిపిన ఒక ముద్ద తయారుచేసి పెట్టుకోవాలి. తర్వాత కర్జూరంలోని విత్తనాలు తొలిగించి మిక్సీ పట్టాలి. దీన్ని రోప్‌లా చేసి పెట్టుకోవాలి. వాక్స్‌కాగితం మీద తెలుగు, ఎరుపు రంగు ముద్దలను విడివిడిగా చపాతీలా రుద్దిపెట్టుకోవాలి. ఎరుపురంగు ముద్దను పలుచగా రుద్ది సన్నని ైస్లెసులుగా కట్‌చేసి ఒక్కోదాన్ని తెలుపుమిశ్రంపై కొంచెం దూరంలో అమర్చి వాటికి అంటుకునేలా మరలా చపాతీకర్రతో మిశ్రమంపై రుద్దాలి. దీనిపై వ్యాక్స్‌పేపర్ పెట్టి తిరగతిప్పాలి. కిందపెట్టి ఉన్న పేపర్ తొలిగించి దానిపై కర్జూరంరోప్ పెట్టి చుట్టాలి. మిశ్రమం ఇరువైపులా అంటుకున్న తర్వాత కట్ చేయాలి. ఆ రోప్‌లను చిన్నముక్కలుగా చేసి 15 నిమిషాలపాటు ఓవెన్‌లో పెట్టాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత క్యాండీకేన్ డేట్‌రోల్స్‌ను తినవచ్చు.