కావాల్సినవి :
వెన్న : చిన్న కప్పు
చక్కెర : 2 కప్పులు
గుడ్లు : 6
మైదాపిండి : పావుకిలో
ఆరెంజ్‌పండ్లు : 2
కేక్ పౌడర్ : కొంచెం
అల్యూమినియం పేపర్ : చిన్నది
పాలు : 1 కప్పు
చక్కెరపొడి : 1 కప్పు
కొబ్బరి తురుము : చిన్న కప్పు
స్ట్రాబెరీ : అలంకరణకోసం
తయారీ :
ఒక గిన్నెలో వెన్న, చక్కెర, గుడ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఆరెంజ్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత పాలు, మైదాపిండి నెమ్మదిగా వేస్తూ కలపాలి. ఇప్పుడు చక్కెరపొడి, కొబ్బరితురుము కూడా వేసి కలపాలి. తర్వాత మిశ్రమాన్ని మందంగా కాకుండా అలాగనీ పలుచగా కాకుండా కేక్‌పాన్‌లో వేసుకోవాలి. మిశ్రమాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటబుల్ ఆయిల్‌ని రాసుకోవాలి. దీన్ని ఒవెన్‌లో పెట్టుకొని 45 నిమిషాలపాటు 350 ఫారన్‌హీట్ వద్ద ఉంచాలి. ఇక అంతే ఎంతో రుచికరమైన కేక్ రెడీ. దీనిపై క్రీమ్, స్ట్రాబెరీతో అలంకరించుకుంటే చూడముచ్చటగా ఉంటుంది.