Diwali Muhurat Trading 2024 : దీపావళి ముహూర్తం ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి బ్రోకింగ్ సంస్థల సలహా

-

ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ అనే సంస్థ దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఏయే స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలో సలహాలు ఇచ్చింది.

ప్రస్తుతం ఆ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం.

ముహూరత్ ట్రేడింగ్ గంట సేపు మాత్రమే ఉంటుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ట్రేడింగ్ సమయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేం సంస్థలు నిర్ణయించాయి.

షేర్ మార్కెట్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ముహూరత్ ట్రేడింగ్ సమయాన్ని మంచిదిగా ఎంచుకొని పెట్టుబడులు పెట్టడం మొదలు పెడతారు.

ఛాయిస్ బ్రోకింగ్ సంస్థ రికమెండ్ చేసిన స్టాక్స్ ఏంటంటే..

బజాజ్ ఆటో (టార్గెట్ ప్రైస్ 12,483)

మార్కెట్లో బజాజ్ టూ వీలర్ ఈవీ చేతక్ వాహనానికి డిమాండ్ బాగా పెరగటం అలాగే సీఎన్జీ ఆధారిత టూవీలర్ రకాలు మార్కెట్లోకి రావడం వల్ల స్టాక్ ప్రైస్ పెరిగిందని నిపుణుల అభిప్రాయం. కాబట్టి దీన్ని కొనడం వల్ల లాభాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏసిసి (టార్గెట్ ప్రైస్ 2,795)

7 నుంచి 8 శాతం వృద్ధి రేటుని మెయింటైన్ చేస్తున్న భారత సిమెంట్ సంస్థ భవిష్యత్తులో మంచి లాభాలను ఇచ్చే దిశగా కొనసాగుతుందని చాయిస్ బ్రోకింగ్ ఆశావాదం వ్యక్తం చేస్తోంది.

గ్రాన్యుల్స్ ఇండియా (టార్గెట్ ప్రైస్ 723)

ఫార్మా కంపెనీ అయినా గ్రాన్యూల్స్ ఇండియా.. ఈ సంవత్సరం మంచి రిటర్న్ సాధించబోతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇంకా ఉగ్రో క్యాపిటల్ (టార్గెట్ ప్రైస్ 345),
గ్లోబల్ హెల్త్ (టార్గెట్ ప్రైస్ 1246)
హెచ్‍సీఎల్ టెక్నాలజీస్ (టార్గెట్ ప్రైస్ 2105)
సోమెనీ సిరామిక్స్ (టార్గెట్ ప్రైస్ 965)… వంటి స్టాక్స్ ముహూర్తం ట్రేడింగ్ రోజున తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటాయని సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version