Vastu: దీపావళి నాడు ఇలా చేస్తే మంచిదట.. కానీ ఇలా మాత్రం చెయ్యద్దు..!

-

ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట. అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని దీపావళి అక్టోబర్ 24న అని అంటున్నారు పండితులు. అయితే దీపావళి నాడు పాటించాల్సిన విషయాలు కూడా వున్నాయి. దీపావళి నాడు మరి చేయాల్సినవి, చేయకూడనివి ఇప్పుడు చూద్దాం.

దీపావళి నాడు చెయ్యాల్సిన పనులు:

దీపావళి అంటే వాళ్లకి నచ్చినట్లుగా చాలామంది ఫాలో అయి పోతూ ఉంటారు కానీ అలా చేయకూడదు. నియమాలను పాటించాలి. దీపావళి నాడు ఇలా కనుక చేస్తే చాలా మంచి కలుగుతుంది.

దీపావళి నాడు వినాయకుడికి కానీ లక్ష్మీదేవి కానీ పూజ చేస్తే చాలా మంచిది. అలానే ఇంట్లో ముగ్గులు వేయడం చాలా మంచిది. దీపావళినాడు వరి పిండితో ముగ్గువేస్తె చాలా మంచి కలుగుతుంది.
దీపావళి నాడు దీపాలను నెయ్యితో కానీ నూనెతో కానీ వెలిగిస్తే మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలతో అలంకరణ చేస్తే చాలా మంచిది.
”ఓం శ్రీం హ్రీమ్ శ్రీం మహాలక్ష్మీ నమః” అనే మంత్రాన్ని జపిస్తే ఎంతో మంచి కలుగుతుంది.

దీపావళి నాడు చేయకూడనివి:

దీపావళినాడు అసలు ఈ పనులు చేయకూడదట. ఇలా చేయడం వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి అసలు ఈ తప్పులు చేయకండి.

దీపావళి నాడు ముగ్గులు వేసినప్పుడు నలుపు రంగుని కానీ బ్రౌన్ కలర్ ని కానీ ఉపయోగించకండి.
దీపావళి నాడు చాలామంది బహుమతులను ఇస్తుంటారు. అటువంటప్పుడు లెదర్ వస్తువులను ఇవ్వకూడదు.
దీపావళినాడు నలుపు రంగు దుస్తులు కూడా వేసుకోకూడదు.
దీపావళి నాడు ఇతరులను తిట్టడం, కోపంగా ఉండడం, ఏడవడం వంటివి చేయకూడదు.
విరిగిపోయిన సామాన్లను దీపావళినాడు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version