మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడిని నేను కాదు.. రోడ్లెక్కి చూడు నిర్మల్ అభివృద్ది ఏంటో తెలుస్తుంది. ఇంద్రకరణ్ రెడ్డి మీరు ఏపార్టీలో ఉన్నారో.. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో..ఓడిపోయిన నెల రోజులకే అధికార పార్టీకి వెల్లారు. మీ రాజకీయ జీవితం లో ఎక్కడ అధికారం ఉంటే అక్కడే ఆగారు. ప్రజల పక్షాన పోరాటం చేశారా.. చౌరస్తాలో నిలబడ్డారు..దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మతిభ్రమించి మాట్లాడుతున్నావేమో … వైద్యులకు చూపించుకో. మీచరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. అధికార పార్టీ మంత్రి బందువులకు సంబందించిన పాక్ పట్ల ఫ్యాక్టరీకి అప్పనంగా సర్కార్ భూమి ఇప్పించావు. ప్రైవేట్ కంపెనీకి 40ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించిన చరిత్ర నీది. నీ భూమి విలువ పెంచడం కోసం అక్కడి భూమి ఇప్పించాం. అధికార పార్టీలో ఉన్నావనే విషయం మర్చిపోయావా. నిర్మల్ లో అసైండ్ భూముల కబ్జాల లెక్కతీస్తా.. ప్రభుత్వం తీయకపోతే మాప్రభుత్వం వచ్చాక బయటకు తీస్తాం అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.