హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి. దసరా పండుగ అక్టోబర్ లో రాబోతుంది. దసరా రోజు జమ్మి చెట్టుని పూజించి పాలపిట్టను చూస్తే చాలా మంచి జరుగుతుందట. ఇక ఈసారి దసరా పండగ ఎప్పుడు వచ్చిందనే దాని గురించి కూడా చూద్దాం.. 2024లో శుక్లపక్షం దశమి తిధి అక్టోబర్ 12న ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13 ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. అక్టోబర్ 12న దసరా పండుగను జరుపుకోవాలి. ఇక అసలు దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి చూస్తే.. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి తొమ్మిది రోజులు యుద్ధం తర్వాత విజయదశమి రోజున సంహరించిందని నమ్ముతారు.
అందుకని దసరాని శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులని పిలుస్తారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. పశ్చిమ బెంగాల్లో దసరాని పెద్ద వేడుకగా జరుపుకుంటారు. విజయదశమి రోజుల్లో జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. అపరాజిత దేవిని శమీ వృక్షం దగ్గర పూజించే సాంప్రదాయం ఉంది. అమ్మవారి సహస్రనామాలలో అపరాజితా ఒకటి. అంటే పరాజయం లేనిది అని అర్థం.
శ్రీరాముడు రావణుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టుకి పూజ చేశారని చెప్తారు. మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు వారి ఆయుధాల్ని షమీ వృక్షం మీద భద్రపరుస్తారట. అజ్ఞాతవాసం పూర్తిచేసుకుని వెళ్లేటప్పుడు శమీ వృక్షాన్ని పూజించి ఆయుధాలు తీసుకుని వెళ్లి యుద్ధంలో గెలిచారు. జమ్మి చెట్టు దేవత వృక్షంలో ఒకటి క్షీరసాగర మదనంలో పాలసముద్రం నుంచి ఉద్భవించిన దేవత వృక్షాలలో జమ్మి కూడా ఒకటి. దసరా రోజున పాలపిట్టను చూస్తే చాలా మంచి శకునంగా భావిస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించుకుని తిరిగి వెళుతుంటే పాలపిట్ట కనబడింది. అది చూసినప్పటి నుంచి వాళ్లకి అన్ని శుభలే కలిగాయట.