నవరాత్రి ఉపవాసంలో ఆరోగ్యం, ఉత్సాహం కోసం తాగవలసిన డ్రింక్..

-

నవరాత్రి ఉపవాసం అంటే కేవలం భక్తితో అమ్మవారిని పూజించడం మాత్రమే కాదు. ఇది మన శరీరాన్ని శుద్ధి చేసి, ఆరోగ్యంగా ఉంచుకునే ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఉపవాస సమయంలో శరీరం డీహైడ్రేట్ అవకుండా శక్తి కోల్పోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే కొన్ని ఆరోగ్యకరమైన రుచికరమైన పానీయాలను తాగడం మంచిది. ఇవి మనల్ని రోజంతా చురుకుగా ఉంచి ఉపవాసానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

ఉపవాసంలో డ్రింక్స్ ఎందుకు ముఖ్యం: ఉపవాసం సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు నీరు అందవు. దీని వల్ల శరీరం నీరసంగా అలసటగా మారుతుంది. తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం పోషకాలను అందించడం చాలా అవసరం. ఈ డ్రింక్స్ మనల్ని ఉపవాస సమయంలో కూడా శక్తివంతంగా ఉంచుతాయి.

Healthy Drinks to Stay Energetic During Navratri Fasting
Healthy Drinks to Stay Energetic During Navratri Fasting

తప్పకుండా తాగవలసిన హోమ్ డ్రింక్స్: ఉపవాస సమయంలో మజ్జిగ ఒక అద్భుతమైన పానీయం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొద్దిగా ఉప్పు, మిరియాలు లేదా జీలకర్ర పొడి వేసి తాగితే మరింత రుచికరంగా ఉంటుంది. ఇక కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉపవాసంలో శక్తిని తిరిగి పొందడానికి ఇది చాలా మంచి పానీయం. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కొద్దిగా తేనె కలిపి తాగితే శరీరం శుభ్రమవుతుంది. ఇది విటమిన్ సి అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక సబ్జా గింజలను నీటిలో నానబెట్టి దానికి నిమ్మరసం లేదా కొద్దిగా తేనె కలిపి తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది ఉపవాసంలో ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

నవరాత్రి ఉపవాసం అనేది భక్తితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. పైన చెప్పిన హోమ్ డ్రింక్స్ ఉపవాస సమయంలో మనల్ని శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తాగడం ద్వారా మీరు ఉపవాసాన్ని సులభంగా పూర్తి చేయగలరు శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు.

గమనిక: ఉపవాసం చేసేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఈ డ్రింక్స్ కేవలం సాధారణ సూచనలు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news