హిందువులు జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అని హిందూ పురాణం చెబుతోంది. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగను భారతదేశంలో హిందువులందరూ జరుపుకుంటారు. ఈ పండుగకు పలు పేర్లు కూడా ఉన్నాయి అవే సర్కత్, లోహ్రా, తెహ్రి, పొంగల్. ఈ పండుగ రోజున స్నానం చేసి సూర్య భగవానుడికి పూజ చేయడం మరియు దానధర్మాలు వంటివి చేయడం వలన ఎన్నో మంచి ఫలితాలను పొందవచ్చు.
ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు దేవతలకు పగలు మరియు రాక్షసులకు రాత్రి మొదలవుతుంది. ఖర్మాసం ముగియడంతో మాఘమాసం కూడా ప్రారంభం అవుతుంది. దాంతో శుభకార్యాలు కూడా మొదలవుతాయి. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని పూజించి నీరు, ఎరుపు పువ్వులు, పువ్వులు బట్టలు, గోధుమలు, తమలపాకు వంటి మొదలైనవి సమర్పించడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడిని ఆరాధించడంతో పాటుగా మీ ఇష్టమైన మరియు గురు మంత్రాన్ని జపించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
దానాలు, ధర్మాలు, యజ్ఞం వంటివి చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. వీటితో పాటుగా మకర సంక్రాంతి రోజున గంగా నదిలో స్నానం చేసి దుప్పట్లు వంటివి దానం చేయడం వలన ఎంతో మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా తెలిసిన, తెలియని జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అయితే చాలా మంది మకర సంక్రాంతిను జనవరి 13వ తేదీన లేక 14వ తేదీన అనే సందేహంలో ఉంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకుంటారు. జనవరి 14వ తేదీన సంక్రాంతి కు సంబంధించిన ముహూర్తం ఈ విధంగా ఉంది. మకర సంక్రాంతి పుణ్యకాలం ఉదయం 9:03 నుండి 05:46 గంటల వరకు ఉండగా, మకర సంక్రాంతి మహా పుణ్యకాలం ఉదయం 9:03 నుండి 10:48 వరకు ఉంది.