వేసవిలో విరివిగా దొరికే చెరుకు రసం ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైనది. దీనివల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. శరీరంలో పెరిగే వేడిని నియంత్రణలో ఉంచుటలో బాగా ఉపయోగపడుతుంది. చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు పొందాలంటే వారంలో కనీసం మూడు సార్లయినా చెరుకు రసం సేవించాలి. అప్పుడు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సరైన పాళ్లలో అందుతాయి.
చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇది అలసటని దూరం చేస్తుంది. శరీరం ఉబ్బుగా మారడం వంటి ఇబ్బందులని పోగొడుతుంది. కిడ్నీల పని తీరును మెరుగు పరిచి ఆరోగ్యవంతంగా చేస్తుంది.
కాలేయ పనితీరును మెరుగుపర్చడంతో పాటు జాండీస్ వ్యాధిని నివారించడంలో చెరుకు రసం కీలకంగా పనిచేస్తుంది.
మృదువైన చర్మాన్ని అందించడంతో పాటు చుండ్రు సమస్యను నివారిస్తుంది.
మలబద్దకాన్ని నివారించి బలహీనతను తొలగిస్తుంది. చెరుకు రసం వల్ల కండరాల్లో బలం కలుగుతుంది.
సంతాన సాఫల్యతను పెంచుతుంది. రుతుక్రమంలో వచ్చే ఇబ్బందులని చెరుకు రసం పోగొడుతుంది. కాకపోతే రుతుక్రమం సమయానికి వారం రోజుల ముందు చెరుకు రసం తాగాలి.
చలికాలంలో నీళ్ళూ తక్కువ తాగుతారు. దానివల్ల డీ హైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. దాహం అయ్యి రాత్రిళ్ళు నిద్రలేచేవాళ్ళు, రోజూ పొద్దున్నపూట ఒక గ్లాసు చెరుకు రసం తాగితే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.
ఐతే చెరుకు రసం తాగడానికి ఒక పద్దతుంది. అస్తవ్యస్తంగా ఉన్న చెరుకు గడల నుండి తీసిన చెరుకు రసం తాగవద్దు. శుభ్రంగా ఉన్న చెరుకు గడల నుండి చక్కగా తీసిన చెరుకు రసాన్ని తాగండి. కూర్చుని తాగడం మర్చిపోవద్దు. ఉదయం పూట మాత్రమే తాగితే మరీ బాగుంటుంది.