కూరగాయలని జ్యూస్ చేసుకుని తాగితే ఎక్కువ లాభాలుంటాయని తెలుసా?

-

కూరగాయలని వండుకుని తినడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయని చాలామందికి అనుమానం ఉంటుంది. దానికంటే పచ్చి కూరగాయలనే తినడమ్ బెస్ట్ అని చెబుతుంటారు. కొందరేమో పచ్చిగా కూడా కాదు జ్యూస్ చేసుకుంటే ఇంకా మంచిది, శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, పోషకాలు అందుతాయని చెబుతుంటారు. మరి వీటన్నింటిలో ఏది మంచిదో ఏది కాదో తెలుసుకుందాం.

కూరగాయలని వండుకుని తినడం వల్ల పోషకాలు, విటమిన్లు తగ్గిపోతాయనే మాట నిజమే. వండడానికి ముందు కూరగాయలని కట్ చేస్తుంటారు. ఇలా కట్ చేయడం వల్ల కూడా పోషకాఅలు పోతుంటాయి. అలాగే స్టవ్ మీద వండేటప్పుడు వేడి కారణంగా మరికొన్ని పోషకాలు తగ్గుతాయి. అందుకే పచ్చి కూరగాయలని తినడమే ఉత్తమం. క్యారెట్, బెండకాయ, బీరకాయ వంటి వాటిని పచ్చిగా తినవచ్చు కానీ ఆకుకూరలని పచ్చిగా తినలేం. అందుకే కూరగాయలని జ్యూస్ చేసుకుని తీంటే ఇంకా బాగుంటుందట.

కూరగాయల్లో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అన్ని విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. ఐతే ఎలాంటి కూరగాయలని జ్యూస్ గా చేసుకోవాలనే విషయం కూడా తెలుసుకోవాలి.

ఒకే రకానికి చెందిన కూరగాయలు కాకుండా, మూడు నాలుగు రకాల కూరగాయల మిశ్రమాన్ని ఒక దగ్గర చేర్చి జ్యూస్ లాగా చేసుకుని తాగవచ్చు. రోజులో కనీసం ఒక గ్లాసు తాగితే సరిపోతుంది. ఇలా రెండు వారాలు చేస్తే ఫలితం కనిపిస్తుందట. చర్మం, జుట్టు, శరీరంలో మార్పులు రావడం మీరు అనుభవించవచ్చు. మనం రోజూ తినే ఆహారం అయినా అది ఏ విధంగా తినాలో తెలుసుకుంటే మంచిదేగా, దానివల్ల మరిన్ని లాభాలు వస్తున్నాయని తెలిసినప్పుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version