రాత్రిపూట పుచ్చకాయని తినచ్చా..?

-

watermelon: వేసవికాలంలో పుచ్చకాయ మనకు ఎక్కువ దొరుకుతుంది. పుచ్చకాయని తీసుకుంటే రకరకాల పోషక పదార్థాలు మనకి డైట్ లో అందుతాయి. వేసవిలో తప్పని సరిగా పుచ్చకాయని తీసుకుంటే మంచిది. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఉండవు. దానికి తోడు పోషక పదార్థాలు కూడా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. దానికి తోడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం ఏమీ లేదు.

watermelon

షుగర్ పేషెంట్లు కూడా పుచ్చకాయని తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పుచ్చకాయ ద్వారా పెంచుకోవచ్చు. గర్భిణీలు రోజు పుచ్చకాయ తీసుకుంటే కూడా ఎంతో మంచిది. పుచ్చకాయని తీసుకోవడం వలన జీర్ణ క్రియ బాగుంటుంది ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. పుచ్చకాయ గుండెకి కూడా ఎంతో మేలు చేస్తుంది. లైకోపీన్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది రక్త పోటుని కంట్రోల్లో ఉంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి.

పుచ్చకాయని తీసుకుంటే చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు దంతాలు తెల్లగా మారుతాయి పెదవులు పొడిబారిపోకుండా పగిలిపోకుండా ఉంటాయి. అల్పాహారం సమయంలో భోజనం సమయంలో తింటే మంచిదే సాయంత్రం వేళప్పుడు కూడా తీసుకోవచ్చు. కానీ రాత్రి పూట మాత్రం తినకూడదు కడుపులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నిద్రలో లేవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version