ఓట్స్‌తో చిల్లా.. వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునేవారికి మంచి స్నాక్‌ ఐటమ్‌.!

-

ఓట్స్‌ను బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా తింటుంటారు. ఎంతసేపు వీటితో ఉప్మాలు, సలాడ్సేనా..ఏదైనా వెరైటీగా ట్రే చేద్దామా..! ఓట్స్‌తో ఏం చేసినా తేలిగ్గా డెజేషన్‌ అవుతుంది. పీచుపదార్థాలు ఎక్కువ కాబట్టి.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఓట్స్‌ విత్‌ టమోటాతో చిల్లా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా.!

ఓట్స్‌ చిల్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ఓట్స్‌ ఒక కప్పు
మల్టీగ్రెయిన్‌ పిండి అరకప్పు
పెరుగు ఒక కప్పు
టమోటా పేస్ట్‌ ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
క్యారెట్‌ తురుము అరకప్పు
ఉల్లికాడ ముక్కలు అరకప్పు
క్యాప్సికమ్‌ ముక్కలు టూ టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీరు కొద్దిగా
లెమన్‌ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
మీగడ ఒక టేబుల్‌ స్పూన్
వాము ఒక టేబుల్‌ స్పూన్

తయారు చేసే విధానం..

ఒక బౌల్‌ తీసుకుని అందులో ఓట్స్‌, పుల్లని పెరుగు, కొంచె వాటర్‌ కలిపి అరగంటపాటు నానపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్‌ తీసుకుని అందులో ఈ నానపెట్టిన ఓట్స్‌, మల్టీగ్రెయిన్‌ పిండి, టమోటా పేస్ట్‌ వేసి కలుపుకోండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ తురుము, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, వాము, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుకుకోండి. పొయ్యిమీద ఒక నాన్‌స్టిక్‌ పాత్ర పెట్టి అందులో మనకు కావాల్సిన సైజులో ఈ ఓట్స్‌ పిండిన చిన్నసైజు దోశలై వేసి పైన మీగడ రాయండి. ఒక వైపు కాలిన తర్వాత మరోవైపు కూడా మీగడ రాసి సిమ్‌లోనే ఉంచి కాల్చుకోండి. అంతే ఎంతో ఆరోగ్యకమైన, రుచికరమైన ఓట్స్‌ చిల్లా రెడీ.! బరువు తగ్గాలనుకునేవారు నైట్‌ టైమ్‌ ఇవి తినేసి డిన్నర్‌ ముగించేయొచ్చు. మాములు వారికి కూడా ఇది ఒక మంచి స్నాక్‌ ఐటమ్‌. పిల్లలు స్కూల్‌ నుంచి రాగనే ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ సారి మీరు ట్రై చేసి చూడండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version