జనవరి 26 నుండి రైతు భరోసా ను పంపిణీ చేస్తాము : భట్టి విక్రమార్క

-

BRS గత 10 ఎండ్లలో ప్రజలను మోసం చేసింది. ధనిక రాష్ట్రంను చేతిలో పెడితే లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. BRS 7 లక్షల అప్పు చేసి కూడా రుణమాఫీ చెయ్యలేక చేతులు ఎత్తేసింది. ఇచ్చిన హామీలను నిబద్ధతతో కచ్చితంగా అమలు చేస్తాం. 2లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాకపోతే తప్పకుండా చేస్తాము. హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు ల మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. 56 వేల మందికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం.

రైతులకు బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రోత్సాహిస్తుంది. సోషల్ మీడియాలో, వాళ్ళ పత్రికలో BRS విషప్రచారం చేస్తుంది. ప్రతి ఎకరాకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇస్తుంది. జనవరి 26 నుండి రైతు భరోసా ను పంపిణీ చేస్తాము. ఎవరు అడ్డు పడిన.. ఎన్ని కుట్రల చేసిన రైతు భరోసాను ఇచ్చి తీరుతాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల ఇస్తాం. రైతుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం నిలపడుతుంది. ఇచ్చిన మాటలను నిలబెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తేకునేలా ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్ళాలి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version