దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన తెలుగు సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నందమూరి తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సంస్త చాలా గొప్పది అని తెలిపారు. మొదటిది హైదరాబాద్ లో జరిగితే.. 12వ సభ హైదరాబాద్ లో జరగడం ఆనందకరం అన్నారు. మలేషియా లాంటి దేశాలకు వెళ్లిన వారికి క్రమంగా బంధం, అనుబంధం ఒకే వేదిక పైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది.
దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే భాష రెండో స్థానంలో తెలుగు ఉన్నది. 18కోట్ల తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు ప్రజలున్నారు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేశాడు. ఐటీని అభివృద్ధిని చేశారు చంద్రబాబు నాయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించి వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 65 శాతం హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తుందని తెలిపారు.