రుచిక‌ర‌మైన `ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రైడ్‌రైస్‌`..!

-

కావాల్సిన‌ పదార్థాలు : 
బియ్యం – అరకిలో,
కోడిగుడ్లు – 2,
పచ్చిమిరపకాయలు – 2,
క్యారెట్‌ ముక్కలు – అరకప్పు,

బీన్స్‌ ముక్కలు – అర కప్పు,
పచ్చిబఠాణీలు – అరకప్పు,
సోయాసాస్ – 1స్పూన్,
ఉప్పు – తగినంత,
కారం – 1 స్పూన్‌,

మిరియాలపొడి – అరచెంచా,
కొత్తిమీర తురుము – అర కప్పు,
నూనె – తగినంత
టమోటాసాస్ – 1 స్పూన్‌,

తయారీ విధానం: 
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొంచెం నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత కోడి గుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్‌, బఠాణీలు, బీన్స్‌, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో సోయాసాస్‌ వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత అందులో అన్నం వేసి టమాటాసాస్‌, సోయాసాస్‌, ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే స‌రిపోతుంది. అంటే వేడి వేడి ఎగ్‌ వెజిటబుల్‌ బిర్యాని ఫిన‌ష్‌. కోడి గుడ్డులో పోషక పదార్థాలు ప్రొటీనులు పుష్క‌లంగా ఉంటాయి. క్యారెట్‌, బీన్స్ మ‌రియు ప‌చ్చిబ‌ఠాణీల వ‌ల్ల‌ మ‌న శ‌రీరానికి కావాల్సిన అనేక ఖ‌నిజాలు అందాతాయి.

Read more RELATED
Recommended to you

Latest news