హెల్ది అయిన మునగ ఆకు చాట్…!

-

మునగ ఆకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజు వంటలలో గుప్పెడు మునగ ఆకుని ఉపయోగిస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం. మరి మునగ ఆకు చాట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మునగ ఆకు చాట్ కు కావలసిన పదార్థాలు: మునగాకులు 1 కప్పు, పల్లీలు ½ కప్పు, చింతపండు గుజ్జు 2 టీ స్పూన్లు, నూనె, ఉప్పు తగినంత, పచ్చి మిర్చి ముక్కలు 1 స్పూన్, బంగాల దుంపలు 2, చాట్ మసాలా పౌడర్ 1 స్పూన్, నిమ్మ రసం 1 స్పూన్, క్యారెట్ 1, కొత్తిమీర తురుము ½ కప్పు.

తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి మునగ ఆకులను వేయించాలి. ఆకులు వేగాక పక్కకి తీసి ఆ పాన్ లో పల్లీలు కూడా వేయించాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఉడికించిన బంగాళదుంపలు, పల్లీలు, క్యారెట్ తురుము, చాట్ మసాలా, చింతపండు గుజ్జు, నిమ్మరసం, కొత్తిమీర అన్ని వేయాలి. ఈ మిశ్రమంలో వేయించిన మునగ ఆకులు, పచ్చి మిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. వీటన్నిటిని కలిపి పైన ఉల్లి పాయ ముక్కలు వేయాలి. ఇష్టమైతే గడ్డ పెరుగు, దానిమ్మ గింజలతో అలంకరిస్తే బాగుంటుంది. అంతే మునగ ఆకు చాట్ రెడీ.

పోషక విలువలు: ఒక కప్పు చాట్ లో కేలరీస్ 64, ఫాట్ 1.4 గ్రా, సోడియం 9 ఏం జి, కార్బోహైడ్రేట్స్ 8.3 గ్రా, ఫైబర్ 2 గ్రా, ప్రోటీన్ 9.4 గ్రా, కాల్షియం 185 ఏం జి, పొటాషియం 337 ఎం జి, ఐరన్ 4.00 ఎం జి.

Read more RELATED
Recommended to you

Exit mobile version