Raw egg viral ice cream : పచ్చి గుడ్లతో తయారు చేస్తున్న వైరల్ ఐస్ క్రీమ్.. తింటే ఈ ఇబ్బందులు తప్పవా..?

-

Raw egg viral ice cream: ఈ మధ్యకాలంలో చాలా రకాల కొత్త కొత్త ఆహార పదార్థాలు వస్తున్నాయి. నెట్టింట అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి కూడా. కొన్ని ఆహార పదార్థాల కాంబినేషన్ చూస్తే మతి పోతుంది. ఇప్పుడు తాజాగా పచ్చి గుడ్లతో తయారుచేసిన ఐస్ క్రీమ్ రోల్ నెట్టెంట వైరల్ గా మారుతోంది. ఏంటి..? ఈ ఐస్ క్రీమ్ ని తినొచ్చా, తింటే సమస్యలు కలుగుతాయా అని చాలామంది అడుగుతున్నారు. ఆరోగ్య నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. పచ్చి గుడ్లను తీసుకుంటే సాల్మొనల్లా అనే బాక్టీరియా ప్రమాదం కలుగుతుంది. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది పలు సమస్యల్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డయేరియా, జ్వరం వాంతులతో పాటుగా డిహైడ్రేషన్ వంటి కాంప్లికేషన్స్ కనబడుతుంటాయి. కోట్లల్లో సాల్మొనల్లా అనే బాక్టీరియా సహజంగా కలిగి ఉంటుంది. అది గుడ్లకి కూడా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. పచ్చి గుడ్లని తీసుకోవడం వలన ప్రిపేర్ చేసిన వెంటనే తీసుకోవడం వలన ఈ బ్యాక్టీరియా ప్రమాదం ఎక్కువగా ఉండదు. పచ్చి గుడ్లతో వంటకం తయారు చేసే దాన్ని ఫ్రిజ్లో పెట్టిన కొంచెం ప్రమాదం ఉండచ్చు. అదే రూమ్ టెంపరేచర్ లో ఉంచితే, బ్యాక్టీరియా పెరిగిపోయి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. పచ్చి గుడ్లు ఈ బ్యాక్టీరియాని వ్యాప్తి చేస్తాయి. కానీ వండిన గుడ్లు ఈ బ్యాక్టీరియాని క్యారీ చేయలేవు.

రిస్క్ లేకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయొద్దు:

ఎక్స్పైర్ అయిన గుడ్లని కొనుగోలు చేయొద్దు.
పాడైపోయిన, పగిలిపోయిన గుడ్లని కొనుగోలు చేయొద్దు.
గుడ్లని కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఫ్రిజ్లో స్టోర్ చేయండి.
గుడ్లతో తయారు చేసిన వంటకాలు ఏమైనా తయారు చేసినప్పుడు వెంటనే తినేయాలి. పిల్లలు, గర్భిణీ స్త్రీలు వృద్ధులు పచ్చి గుడ్లతో తయారు చేసిన వంటకాలను తీసుకోకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version