ఏపీ మందుబాబులకు శుభవార్త..రూ.100 లోపే క్వార్టర్ ఇచ్చేలా ప్రణాళికలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోందని సమాచారం. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేస్తోన్న ఎక్సైజ్ శాఖ….మద్యం కొనుగోళ్ల పాలసీ పైనా వివిధ మద్యం కంపెనీలతో చర్చించిందట.
అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులివ్వనున్న ప్రభుత్వం…ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి ప్రముఖ బ్రాండ్లు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోందట. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్న అధికారులు….వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు రూ. 100 లోపే ఉండేలా చర్యలు తీసుకోనున్నారట. తక్కువ ధర మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసిన గత ప్రభుత్వం….మినిమం ధర రూ. 200గా ఫిక్స్ చేసింది. అక్టోబర్ లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి… రూ.100 లోపే క్వార్టర్ ఇచ్చేలా ప్రణాళికలు చేస్తోంది చంద్రబాబు సర్కార్.