మనం కూరగాయని వండుకుని తింటాం. ఏదైనా సరే కూరలా చేసుకుని తింటాం. రుచి అనేది మనకి అలవాటయ్యింది కాబట్టి వండుకుని తినడం బాగుంటుంది. కాకపోతే వండుకోవడం వల్ల మన తినే కూరగాయల్లోని పోషకాలు నశిస్తాయని కొందరి వాదన. అందుకే పచ్చివాటినే తినాలని సలహా ఇస్తారు. చాలా మంది బెండకాయని పచ్చిగా ఉన్నప్పుడే తింటుంటారు. అలా పచ్చిగా ఉన్నప్పుడు తినొచ్చే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. కూరల్లో ఉల్లిపాయ వేసుకున్నా కూడా పచ్చి ఉల్లిపాయ తినే అలవాటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరూ అలానే తినాలని అనుకుంటారు.
పచ్చి ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు..
వేసవికాలంలో మీకు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పడుకునే ముందు ఉల్లిపాయ తినండి. ఇలా చేస్తే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువ.
బీపీ నియంత్రణలో లేకపోతే రోజూ రెండు ఉల్లిపాయలు తింటే బాగుంటుందని చెబుతున్నారు.
జలుబు, కఫం ఇబ్బందికరంగా మారినపుడు ఉల్లిపాయతో చేసిన రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుతువు మారినప్పుడు కామన్ గా వచ్చే వాటిల్లో జలుబు ఒక్కటి కాబట్టి, ఉల్లిపాయ రసం తాగండి.
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది.
శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర వహిస్తుంది. రక్తంలోని అనేక విష పదార్థాలన్ను శరీరం నుండి వేరు చేసి, వాటివల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలని తగ్గిస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందుకే మీరు మీ ఆహారంలో సరైన పాళ్ళలో ఉల్లిపాయని తీసుకుంటున్నారా లేదో చెక్ చేసుకోండి.