శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు TGSRTC తెలిపింది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కూరుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను TGSRTC నడుపుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదిన ఉండగా.. 7వ తేదీ నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్నగర్ మీదుగా జాతరకు వెళ్తాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సంస్థ కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ను సంప్రదించగలరు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.