లాక్డౌన్ సమయాన మీ కిచెన్లో నిల్వ ఉంచుకోవాల్సిన పోషకాహారాలు..

-

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. కొన్ని కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ కిచెన్లో కావాల్సినన్ని నిత్యవసర వస్తువులు నిల్వలు ఉండాల్సిందే. వాటికోసం అనుమతి ఉన్న సమయాల్లో తరచుగా బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. కాబట్టి మీ కిచెన్లో కావాల్సిన సరైన పోషక విలువలు ఉన్న పోషకాహారాలని నిల్వ ఉంచుకోండి. అసలు ఎలాంటి పోషకాలని ఉంచుకోవాలో ఇక్కడ చూద్దాం.

కరోనా సమయం కాబట్టి మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసే పొషకాహారాలను ఉంచుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను కిచెన్లోకి తెచ్చుకోండి.

కాయధాన్యాల్లో పప్పులు, శనగలు మొదలగునవి ఖచ్చితంగా ఉంచుకోండి.

ఆకు కూరలు- మునగకాయ ఆకులు,

దుంపకూరలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలగు వాటిని ఖచ్చితంగా ఉంచుకోండి.

ఇతర కూరగాయల్లో బెండకాయలు, కాకరకాయ, వంకాయ, బీన్స్ వాటిని ఉంచుకోండి.

పండ్లలో- చింతపండు, అరటి పండు, పనస పండు, టమాట, జామ, మామిడి, మస్క్ మిలన్, బొప్పాయ, పుచ్చకాయ, నల్ల ద్రాక్షలు, స్ట్రాబెర్రీ, ఫైనాపిల్, చెర్రీలు

దుంపలు- బంగాళదుంపలు, బీట్ రూట్, క్యారెట్, అల్లం మొదలగునవి.

గింజలు, విత్తనాలు – బాదం, వాల్ నట్స్, కాజు, కొబ్బరికాయ, పిస్తా, సూర్యపువ్వు విత్తనాలు మొదలగునవి.

పాలు, పాలపదార్థాలు- పెరుగు, పన్నీరు

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఏ వస్తువునైనా ఎక్కువ రోజులు, మరీ ఎక్కువగా నిల్వ చేయవద్దు. ప్రతీ ఒక్కరూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎదుటి వారి పట్ల కొంచెం శ్రద్ధ వహించి జాగ్రత్తగా వ్యవహరించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version