విజయ్ సేతుపతి మరో అద్భుత ప్రయోగం.. మాటలు లేకుండానే..

-

కోళ్ళకి వ్యాప్తి అవుతున్న బర్డ్ ఫ్లూ భయాన్ని రేపుతుంది. మొత్తం 11రాష్ట్రాల్లో చికెన్ వ్యాపారులకి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడింది. సరిగ్గా ప్రాసెస్ చేసిన ఫౌల్ట్రీ కోళ్ళకి బర్డ్ ఫ్లూ బాధ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పటికీ, చాలా మంది చికెన్, గుడ్లు తినడం మానేసారు. అందుకే చికెన్ రేట్లు విపరీతంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో చికెన్ తో సమానంగా ప్రోటీన్ ని అందించే కూరగాయల కోసం వెతుకుతున్నారు. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ని తీసుకోవడానికి ఏమేమి కూరగాయలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Salads: Quinoa Salad with Radish, Grape, Soy Beans and Pecan Nuts Still Life

సోయాబీన్:

100గ్రాముల సోయాబీన్లలో 36శాతం ప్రోటీన్ ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం వలన శరీరానికి రోజులో కావాల్సిన 72శాతం ప్రోటీన్ అందుతుంది. సోయాబీన్ ని రకరకాలుగా తీసుకోవచ్చు. చాట్ గా తయారు చేసుకోవచ్చు, లేదా కూరగా వండుకోవచ్చు.

పనీర్:

మాంసం తినని చాలామందికి పనీర్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. వంద గ్రాముల పనీర్ లో 14శాతం ప్రోటీన్ ఉంటుంది. దీన్ని ఏ విధంగానైనా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.

క్వినోవా:

కరకరలాడే క్వినోవాలో ప్రోటీన్ సరైన పాళ్ళలో ఉంటుంది. వంద గ్రాముల క్వినోవాలో 14శాతం ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరానికి ప్రోటీన్ ని అందించడంతో పాటు ఎంతో మేలు చేస్తుంది.

గింజలు:

గింజల్లో మనకి కావాల్సిన ప్రోటీన్ చాలా అధిక మొత్తంలో ఉంటుంది. బాదం, వాల్ నట్స్, పల్లీలు మొదలగు వాటిల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. రోజువారి ఆహారంలో వీటిని సరిగ్గా తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.

బర్డ్ ఫ్లూ భయం చికెన్ తినకుండా చేస్తే కూరగాయల్లో ఉండే వెరైటీలని ఆస్వాదించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version