వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వేసవికాలంలో ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం వేడిగా ఉండడం వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం తీసుకునే ఆహారం బట్టి మనం చాలా సమస్యలని దూరం చేయొచ్చు మరి వేసవిలో ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాన్ని చూద్దాం.
వేసవిలో హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. లైట్ గా తక్కువ మోతాదులో మాత్రమే ఆహార పదార్థాలని తీసుకోండి. ఎక్కువగా వేసవిలో తాజా పండ్లు, తాజా కూరగాయల మీద ధ్యాస పెట్టండి.
నీళ్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోండి. కమల పండ్లు పుచ్చకాయలు టమాటాలు వంటివి తీసుకుంటే మంచిది.
కంటి ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం. బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ని పెట్టుకోవడం వలన హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షణ లభిస్తుంది.
వేసవికాలంలో ఆల్కహాల్ కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటిని తీసుకుంటే డిహైడ్రేషన్ సమస్య కలుగుతుంది.
అలానే వేసవిలో నీళ్లు ఎక్కువ తీసుకుంటూ ఉండండి. కనీసం రోజుకి రెండు నుండి మూడు లీటర్ల నీళ్లను తీసుకోండి.
వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండండి. ఉదయం 11:00 కు ముందు మాత్రమే పనులు చేసుకోండి. సాయంత్రం చల్లబడిన తర్వాతనే బయటకు వెళ్ళండి.
బయట ఫుడ్ కి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేసవిలో వీలైనంత వరకు బయట ఆహారాన్ని తీసుకోవద్దు.
చర్మ ఆరోగ్యం కూడా దృష్టి పెట్టండి. వేసవిలో ఎక్కువగా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వడదెబ్బ వంటి సమస్యలు వస్తాయి ఇలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉండండి.