Hansika : బ్లాక్ ఔట్​ఫిట్​లో థండర్ థైస్​తో రెచ్చిపోయిన యాపిల్ బ్యూటీ

-

కోలీవుడ్ బ్యూటీ హన్సిక పెళ్లి తర్వాత గ్లామర్ షోలో హద్దులు చెరిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్​ఫిట్​లో నెట్టింట సెగలు పుట్టించింది. థైస్ స్లిట్ డ్రెస్సులో బ్యాక్ అందాలు ఎక్స్​పోజ్ చేస్తూ తన థండర్ థైస్​ షో చేస్తూ కవ్వించింది. ఘాటు పోజులిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది. కత్తిలాంటి చూపుల్తో మాయ చేసింది. ప్రస్తుతం హన్సిక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దేశముదురు సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన హన్సిక ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్​లో దూసుకెళ్లింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్​కే పరిమితమైంది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ తమిళ ఇండస్ట్రీని ఏలుతోంది.

హన్సిక ఇటీవలే సోహైల్ అనే బిజినెస్​మ్యాన్​ను పెళ్లి చేసుకుంది. పారిస్​ ఐఫిల్ టవర్ వద్ద అతడు ప్రపోజ్ చేసిన ఫొటోలు పోస్టు చేసి తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంది హన్సిక. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version