సోషల్ మీడియాలో ఆలియా భట్ మరోసారి తన హవా చూపించింది. ఓ మేగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ తో అభిమానులను పలకరించింది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఏంజిల్ లా మెరిసిపోయింది. తన కిల్లర్ పోజులతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది.
ఎల్లే మేగజైన్ కోసం ఆలియా భట్ చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ కలర్ పూల ఫ్రాక్ లో ఆలియా చాలా ముద్దుగా కనిపిస్తోంది. సిల్వర్, గోల్డెన్, పింక్ కలర్ గౌనుల్లో ఆలియా భలే అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ట్రెండింగ్ ఔట్ ఫిట్స్ లో ఆలియా కిల్లింగ్ పోజులిచ్చిన ఆలియా కుర్రాళ్ల మనసు మరోసారి దోచేసింది. ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. జోయా అక్తర్ డైరెక్షన్ లో కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలతో కలిసి జీ లే జరా సినిమాలో నటించనుంది.