జగిత్యాలలోని మల్లాపూర్ అనే గ్రామంలో ఒక వివాహమైన ఇంట కూతుర్ని అత్తారింటికి పంపిన కొద్దీ సేపటికే గుండెపోటుతో పెళ్లి కూతురు తండ్రి ప్రాణాలు విడిచాడు. అప్పటి దాకా బంధువుల హడావిడిగా సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బిడ్డ పెండ్లయిన కొద్దీ సమయానికే తండ్రి మృతి చెందడం బంధుమిత్రులను ఎంతో బాధ కలిగించింది. కొత్తదాంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బెజ్జారపు లింబాద్రి(45) చిన్న కూతురు పెండ్లి గురువారం అంగరంగ వైభవంగా చేసారు. అప్పగింతల కార్యక్రమాన్ని సైతం పూర్తి చేశారు. అనంతరం లింబాద్రి.. తన కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. నిద్రలోనే గుండెపోటుగు గురై ప్రాణాలు విడిచాడు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు విగతజీవిగా కనిపించిన ఇంటిపెద్దను చూసి కన్నీళ్లు విడిచారు.
ఇదిలా ఉంటే.. వరంగల్ లో కూడా ఓ వృద్ధుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. శుక్రవారం ఉదయం వరంగల్ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడికి గుండె పోటు వచ్చింది. అక్కుడున్న వారు వెంటనే ట్రాఫిక్ సీఐ బాబు లాల్‌కు సమాచారం అందించారు. ఆయన బస్టాండ్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ రామారావును, సిబ్బందిని తక్షణమే ఘటనా స్థలానికి పంపించారు. ఓ వైద్య విద్యార్థినితో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా బాధితుడికి సీపీఆర్ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా, అతడిలో కదలిక లేదు. అనంతరం అంబులెన్స్‌లో అతడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కానీ అప్పటికే ఆ వృద్ధుడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.