Priyanka Arul Mohan : ప్రకృతిలో జాలీగా OG బ్యూటీ క్యూట్ పోజులు

-

ప్రియాంక అరుల్ మోహన్ ఈ మలయాళీ కుట్టి సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టించింది. తాజాగా వైట్ కలర్ షర్ట్​లో ఫారెస్ట్​లో ఫొటోలు దిగి షేర్ చేసింది. ఈ ఫొటోషూట్​లో ప్రియాంక క్యూట్ పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. క్రేజీ పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. సిగ్గు పడుతూ దిగిన కొన్ని ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. ఈ బ్యూటీ అందానికి తెలుగు కుర్రాళ్లు మరింత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

ప్రియాంక టాలీవుడ్​లో నేచురల్ స్టార్ నానితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత శర్వానంద్​తో కలిసి శ్రీకారంలో జతకట్టింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో ప్రియాంక డిఫరెంట్ లుక్​లో కనిపించింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తన మూడో సినిమాకు బంపర్ ఆఫర్ కొట్టేసింది.

థర్డ్ సినిమాకే ఈ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. పవర్​ స్టార్​ పవన్​-సుజిత్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక నటిస్తున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్​ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version