మెదడు షార్ప్ అవ్వాలంటే తప్పనిసరిగా వీటిని అనుసరించండి..!

-

మన మెదడు ఎంత బాగా పని చేస్తే మనం అంత బాగా ఆలోచించగలుగుతాము. అయితే చాలామంది జ్ఞాపక శక్తి లేదని మెదడు సరిగా పని చేయట్లేదు అని భావిస్తూ ఉంటారు. కానీ మెదడు షార్ప్ గా ఉండాలంటే మెదడుకి సంబంధించి ఆక్టివిటీస్ అనుసరించొచ్చు. అప్పుడు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి అవుతుంది. పైగా ఈ టిప్స్ ని అనుసరించడం వలన డిమెన్షియా, ఆల్జీమర్స్ వంటి సమస్యలు కూడా ఉండవు. మరి మెదడుని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు..? ఎలా షార్ప్ గా మార్చుకోవచ్చు అనేది చూద్దాం.

వ్యాయామం చేయండి

శరీరానికి మాత్రమే కాదు వ్యాయామం మెదడుకి కూడా మేలు కలిగిస్తుంది. వ్యాయామం చేసినప్పుడు మెదడులో కొన్ని రసాయనాలలో మార్పులు వస్తాయి దీనితో మెదడు బాగా పనిచేస్తుంది.

విజువలైజ్ చేయండి

విజువలైజేషన్ చేయడం వలన కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో దానిని మీరు ఒకసారి చూసుకోండి. ఉదాహరణకి మీరు బయటకు వెళ్లి సామాన్లు తెచ్చుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్లినట్లు అక్కడ సామాన్లు కొనినట్లు ఊహించుకోండి. ఇలా కూడా మెదడును షర్టుగా మార్చుకోవచ్చు.

గేమ్స్ ఆడండి

మెదడుకు సంబంధించిన ఆటలు అంటే సుడోకో, క్రాస్ వర్డ్ వంటివి ఆడుతూ ఉండండి. దీనితో మెదడుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

మ్యూజిక్ వినడం

మ్యూజిక్ ని వింటే కూడా మైండ్ షార్ప్ గా అవుతుంది అలానే కొత్త విషయాలను తెలుసుకుంటే కూడా మీ మెదడుని షార్ప్ గా మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version