మహబూబ్‌నగర్ కాలువలోకి దూసుకెల్లింది బస్సు. భారీ వరద ఉద్ధృతి రావడంలో.. బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లాలో గత రాత్రి భారీ వర్షం పడింది. ఇంకా ఉద వర్షము పడుతోంది. అయితే భూత్పూర్ మండల పరిధిలో చెరువులు, పొంగుతున్న వాగులు పారుతున్నాయి. అంబటిపల్లి వాగుకు వరద ఉధృతి ఎక్కువగా ఉంది.

దివిటిపల్లి ఐటీ కారిడార్ వెళ్లే మార్గంలో రహదారి తెగింది. దింతో సిబ్బందిని తరలించే బస్సు కాలువలోకి దూసుకెల్లింది. అయితే అదృష్టవశాత్తు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అటు తెలుగు రాష్ట్రాల్లో వాగులు పొంగుతున్నాయి. భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్నాయి వాగులు, వంకలు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముశ్రీఫా వాగు పొంగి ప్రవహించడంతో కోస్గి, దౌల్తాబాద్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చేవెళ్ల నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉవ్వెత్తున పొంగి పొర్లుతోంది ఈసీ నది. వరద ఉద్ధృతికి పొంగుతోంది విజయవాడ కొండవీటి వాగు.
భారీ వరద ఉద్ధృతి.. బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
మహబూబ్‌నగర్ జిల్లాలో గత రాత్రి భారీ వర్షం
భూత్పూర్ మండల పరిధిలో పారుతున్న చెరువులు, పొంగుతున్న వాగులు
అంబటిపల్లి వాగుకు వరద ఉధృతి
దివిటిపల్లి ఐటీ కారిడార్ వెళ్లే మార్గంలో తెగిన రహదారి
కాలువలోకి దూసుకెళ్లిన సిబ్బందిని తరలించే… pic.twitter.com/rQx8TC5Y4E
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025