పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ముల్లంగి తో చెక్ పెట్టండి..!

-

ఇప్పుడున్న ఆహారంలో రిఫైండ్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వలన మలమూత్రాలు సరిగా విడుదల అవ్వవు. దీనికి కారణం ఆహార పదార్థాలను రి రీఫైండ్ చేసినప్పుడు అందులో ఉన్న పీచు పదార్థాలు మొత్తం తొలగి వేస్ట్ గా ఉన్న కార్బొహైడ్రాట్స్ మాత్రమే మిగిలిపోతాయి.మలము సరిగా విడుదల కాక రక్తనాలాలూ చిట్లి రక్తము మలముతో కలిసిపోతుంది. రక్తము గట్టిపడి గూడు కట్టుకొని దాని చుట్టూ చర్మం ఏర్పడి హేమోరాయిడ్లు లేదా పైల్స్ ఏర్పడుతాయి . ఇది పాయువు మరియు మోషన్ నాలం చుట్టూ ఉబ్బడానికి కారణం అవుతుంది. పైల్స్‌లో, పురీషనాళం నుండి రక్తస్రావం మరియు ప్రేగు స్పర్శ లో ఇబ్బంది ఉంటుంది.

పురీషనాళం నుండి రక్తస్రావం.. విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. పైల్స్ సాధారణంగా 40 సంవత్సరాల వయసు తర్వాత వస్తాయి. ఇది అందరి కంటే పురుషులలో అధికంగా వస్తుంది .ఈ సమస్యతో చాలా మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.కాబట్టి వైద్యుని సలహా పాటిస్తూ కొన్ని ఇంటి చిట్కాలు వాడితే ఆపరేషన్ వరకు వెళ్ళే అవసరం లేకుండా చేస్తుంది.
హేమోరాయిడ్ నివారణలలో ముల్లంగి అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది.

ముల్లంగిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది

ముల్లంగిలో కరిగే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేయడమే కాకుండా జీర్ణక్రియ సజావుగా పని చేయడానికి కూడా తోడ్పడుతుంది.ఇది హేమోరాయిడ్స్ వల్ల కలిగే నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది.

పైల్స్ నొప్పి ఉపశమనం కోసం:
200 గ్రాముల ముల్లంగిని మెత్తగా పేస్ట్ చేసి 2 టేబుల్ స్పూన్ ల తేనెతో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే అది మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా, తెల్ల ముల్లంగిని లేదా నీడలో అరబెట్టిన ముల్లంగి ఆకును పేస్ట్‌లా చేసి, అందులో కొన్ని పాలు కలపి, పైల్స్ నొప్పి మరియు వాపు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్‌ను రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version