్మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ఏడాదిలోనే ఎంత తేడా?!
నాడు ఎటుచూసినా ఎరువు.. నేడు ఏడాదంతా కరువు.
– కేసీఆర్ వ్యూహంతో రైతులకు తప్పిన ఎరువుల తిప్పలు
– ముందుగానే ప్రణాళిక.. సీజన్‌కు ముందే సర్వం సిద్ధం
– కాంగ్రెస్ పాలనలో తారుమారు.. మళ్లీ యూరియా గోస
– 8 లక్షల టన్నులు సరఫరా చేయలేక సర్కారు ఆపసోపాలు
– నేడు క్యూలైన్లు, మళ్లీ టోకెన్లు, రోజుల తరబడి పడిగాపులు
– నాడు రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా
ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకొనేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లు మొదలయ్యాయి. రైతులకు గంటల తరబడి నిలబడే ఓపిక లేక క్యూలైన్లలో చెప్పులు, పాస్‌బుక్కులు దర్శనమిస్తున్నాయి’ అని విమర్శించారు.