మంచి డైట్ ఫాలో అయినంత మాత్రనా.. వ్యాయామం చేయనక్కర్లేదా..!

-

వ్యాయామాలు ఏం చేయకుండా.. మంచి జీవనశైలి పాటిస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చు అని చాలామంది అనుకుంటారు. అవును కదా.. హెల్తీ డైట్ పాలో అయినప్పుడు వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఏంటి.? ఈరోజు ఈ విషయంపై అవగాహన పెంచుకుందాం. అసలు వ్యాయామాలు వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది. డైట్ మెయింటేన్ చేస్తూ కూడా చేయాలా? చేయకపోతే ఏం అవుతుంది.

వ్యాయామం చేయడం ద్వారానే శరీరంలో రాకపోకలు సరిగ్గా జరుగుతుతాయి. వ్యాయామం మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరంలో అన్ని భాగాలు కదలికలు వస్తాయి. అప్పుడే శక్తి ఉత్పత్తి అవుతుంది. అప్పుడే బ్లడ్ సప్లై అవుతుంది. దాని ద్వారానే.. గాలి, నీరు, ఆహారం అందుతుంది. కండరాల బలం పదునుగా ఉంటుంది. ఉదాహరణకు.. ఇంట్లో వాడని కత్తి ఏం చేయకున్నా తప్పు పడుతుంది. వాడని తలుపులు కిటికీలు కిర్రుకిర్రు మన శబ్ధం వస్తాయి. చూడ్డానికి బానే ఉంటాయి. కానీ పాడైపోతాయి. మనిషి శరీరం కూడా అంతే.. ఎక్కడికక్కడ పట్టేస్తాయి. అసలు రోజులో ఏం వ్యాయామం చేయకుండా..మీరు పస్తులు ఉన్నా బరువు తగ్గొచ్చేమో కానీ..ఆరోగ్యంగా ఉండలేరు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

కనీసం రోజుకు రెండు గంటలన్నా వ్యాయామం చేయడం మంచిది.. ఈరోజుల్లో అంత టైం ఎవడికి ఉంది అనుకుంటున్నారా.. అవును కదా.. అందుకే.. ఉదయం 30నిమిషాల పాటు బాడీకీ బాగా శ్రమనిచ్చే పనులు..డ్యాన్స్ వేయటం/ ఆటలు/ యోగా/ ప్రాణామాయం/ఈత కొట్టడం/ బాడీకి చెమటలు పట్టించే చిన్నపాటి ఎక్సర్ సైజ్ లు ఇలా ఏదో ఒకటి చేయండి. ఈవినింగ్ వాకింగ్ చేయడం అలవాటుగా పెట్టుకోండి.

ఇతర దేశాల్లో వారికి మనకంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి.. కానీ వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు.. కారణం.. ఎవరి పని వారు చేసుకోవడం, వ్యాయామాలకు ఎక్కువ టైం కేటాయించడం. మనం ఏంట్రా అంటే..బైకు మీద ఆఫీసులకు వెళ్లడం.. అక్కడ కుర్చోని పనిచేయడం, మళ్లీ ఇంటికి రావడం, తినడం, పడుకోవడం.. అసలు బాడీకీ ఎక్కడా శారీరక శ్రమ పెట్టడం. ప్రజర్ అంతా మైండ్ కే.. బాడీకి వ్యాయామం చేసినప్పుడే బాగా కదలికలు వచ్చి షార్ప్ గా పనిచేస్తుంది. వారానికి ఐదు రోజులైనా అరగంట పాటు వ్యాయామం చేయడం అలవాటుగా పెట్టుకోవాలి.

వ్యాయామం చేయకపోవడం వల్ల అసలు ఎలాంటి జబ్బులు వస్తాయి..?

చాలా జబ్బులకు వ్యాయామం చేయకపోవడమే కారణం.. అందులో ముందుండేదీ.. ఒబీసిటీ. వ్యాయామాలు చేయనందు వల్ల కొవ్వు పేరుకుపోతుంది. కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరేడ్స్, ఎల్డీఎల్ బాగా పెరిగిపోతాయి. డయాబెటీస్ రావడానికి కూడా వ్యాయామం లేకపోవడమే కారణం.. నోరు కదకపోతే లాలాజలం ఎలా రాదో.. వ్యాయామం చేయకోపోతే కీళ్లలో జిగురు తయారుకాదు. జిగురు ఉత్పత్తి తగ్గిందంటే.. కీళ్లు అరిగిపోతాయి.ఎముకలు బలహీన అవుతాయి. ఆకలి సరిగా అ‌వదు. విసర్జన సరిగ్గా ఉండదు. కదలకుండా ఉండే వాళ్లకు అసలు చెమట కూడా పట్టదు. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. బద్దకంగా ఉంటారు, ఊరికే అలసిపోతారు. ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. దీర్ఘరోగాలు రావడానికి కూడా ప్రధాన కారణం బాడీకీ ఎలాంటి వ్యాయామం లేకపోవడమే.

ఆరోగ్యకరమైన ఆహారం తిన్నప్పటికీ.. బాడీకీ వ్యాయామం కావాల్సిందే.. నేను సన్నగా ఉన్నా.. నాకెందుకు వ్యాయామం అనుకుంటారు.. వ్యాయామాలు అనేది.. లావు తగ్గడానికే కాదు.. ఏ సైజులో ఉన్నా బాడీకీ వ్యాయామాలు అవసరం. మీ జీవనశైలిలో వ్యాయామానికి కూడా ఒక అరగంట టైం కేటాయించలేరా చెప్పండి. డైలీ ఎక్సర్ సైజ్ చేసే వాళ్లు ఎంత స్ట్రాంగ్ ఉంటారు..వర్క ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లకు ఈరోజుల్లో బ్యాక్ పెయిన్ పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారు కూడా డైలీ కూడా డైలీ వ్యాయామాలు చేయడం వల్ల నొప్పుల తగ్గుతాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version