కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆహారం జీర్ణం అయ్యే సమయంలో ఎన్నో వ్యర్థ పదార్థాలు విడుదల అవుతాయి. అయితే అవి ఎప్పటికప్పుడు తొలగించి పూర్తి ఆరోగ్యాన్ని కాపాడడానికి కిడ్నీలు సహాయం చేస్తాయి. కాకపోతే ఎన్నో కారణాల వలన ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది కిడ్నీకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం, మంచి నీరును తాగకపోవడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటుగా కిడ్నీల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా శాతం మందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని పదార్థాలను రోజూ ఉపయోగించడం వలన కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి.
సహజంగా అందంగా కనిపించేందుకు చాలా శాతం మంది ఫెయిర్నెస్ క్రీమ్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటిలో ఉండేటువంటి హానికరమైన పదార్థాలు చర్మం గ్రహించడం వలన కిడ్నీలోకి చేరుతాయి. దీంతో కిడ్నీల పనితీరు పై ప్రభావం పడుతుంది. కనుక చర్మానికి సంబంధించి ఎలాంటి ఉత్పత్తులనైనా కొనుగోలు చేస్తే వాటిలో ఉండే పదార్థాలను తప్పకుండా చదవండి మరియు డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి మాత్రమే కొత్త ఉత్పత్తులను ఉపయోగించండి. చాలా శాతం మంది ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా ఎదుర్కొన్నప్పుడు సొంత నిర్ణయాలను వెంటనే తీసుకుంటారు. డాక్టర్ ను సంప్రదించకుండా మందులు కొనుగోలు చేస్తారు. అయితే దీర్ఘకాలంలో ఇదే కొనసాగడం వలన కిడ్నీలపై ఎంతో ప్రమాదం ప్రభావం పడుతుంది.
ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటారో కిడ్నీలకు రక్త సరఫరా జరగదు. దాంతో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు మరియు జిమ్ కు వెళ్లేవారు వ్యాయామంతో పాటుగా ప్రోటీన్ కు సంబంధించిన సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే వాటిని ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ పనితీరు పై ప్రభావం పడుతుంది మరియు పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక వీటిని వీలైనంతవరకు తగ్గించండి. దీంతో కిడ్నీల పనితీరు బాగుంటుంది.