ఏపీ అసెంబ్లీ స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని మాజీ సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘అసెంబ్లీలో స్పీకర్ రూలింగ్ నడుస్తుందని.. స్పీకర్‌కు దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్ఫష్టంచేశారు.తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను ఈసారికి క్షమిస్తున్నా. జగన్ ఇలాగే వ్యవహరిస్తే ఏంచేయాలో సభకే వదిలిపెడుతున్నా’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కాగా, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికే వంత పాడుతున్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.