జ్ఞాన దంతం లేదా విజ్డమ్ టూత్ (Wisdom Tooth)అనేది చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. కొంతమందికి 25 సంవత్సరాలలోపు జ్ఞాన దంతం వస్తుంది. ఇంకొంతమందికి వయసు పైబడిన తర్వాత కూడా వస్తుంది. ఇది చిగురు నుంచి బయటికి వచ్చేటప్పుడు సరిగా పెరగనప్పుడు భరించలేని నొప్పి వాపు అసౌకర్యాన్ని కలిగిస్తుంది అటువంటి సమయంలో చాలామంది వెంటనే నొప్పిని తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు వెతుకుతారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డెంటల్ డాక్టర్ ని కలవాలి లేదంటే కొద్దిపాటి నొప్పిని ఇంట్లో ఉండే చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న లవంగం ఈ నొప్పికి ఒక సహజ సిద్ధమైన సమర్థవంతమైన పరిష్కారాన్నిగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్ఞాన దంతం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు చాలామంది నొప్పి తగ్గడానికి మందులు యాంటీబయటిక్స్ వాడతారు. కానీ వాటికి బదులుగా నొప్పి తేలిగ్గా ఉన్నప్పుడే సహజసిద్ధమైన లవంగం నూనె లేదా లవంగం పొడిని వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లవంగంలో యూజెనాల్ (Eugenol) అనే శక్తివంతమైన ఆయిల్ ఉంటుంది. ఇది సహజమైన అనస్తీటిక్ యాంటీ, ఇంప్లిమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి నివారించడంలో వాపు నివారించడంలో నోటిలోని బ్యాక్టీరియాని తొలగించడంలో సహాయపడుతుంది.

లవంగం నూనె దూది లో ముంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా అద్దాలి, ఇది వెంటనే నరాలకు మత్తు కలిగించిన నొప్పి తగ్గిస్తుంది. ఈ ప్రక్రియను అవసరమైనప్పుడు రోజుకు రెండు మూడు సార్లు చేయవచ్చు. కొన్ని లవంగాలను దంచి పొడిచేసి కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి ఈ పేస్టును నొప్పి ఉన్న పంటిపై లేదా చిగురుపై సున్నితంగా అప్లై చేయండి ఇది కూడా నొప్పి వాపు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో కొన్ని లవంగాలను వేసి మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత పుక్కిలించండి ఇలా చేస్తే నోటిలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఒకటి లేదా రెండు లవంగాలు నోటిలో వేసుకొని నొప్పి ఉన్న ప్రదేశంలో మెల్లగా నమిలితే దానిలోని రసం బయటకు వచ్చి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి, లవంగాల నూనె కలిపి పేస్ట్ లా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే ఐదు నుంచి పది నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వలన నొప్పి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. జ్ఞాన దంతా నొప్పి తగ్గించేందుకు చిగుళ్లలో మంటని ఇన్ఫెక్షన్ ని దూరం చేయడానికి ఉప్పు పనిచేస్తుంది. అందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచి పుక్కిలించండి ఇలా చేయడం వలన నొప్పి కొంతవరకు తగ్గుతుంది.
లవంగం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే నొప్పి తరచుగా వస్తుంటే లేదా తీవ్రంగా ఉంటే దంత వైద్యున్ని సంప్రదించడం తప్పనిసరి.