కిడ్నీలో రాళ్లు చేరడం అనేది చాలా సాధారణ సమస్య. వయసుతో పని లేకుండా చాలా మందిని ఈ సమస్య బాధిస్తుంది. బ్లడ్ లో ఎక్కువ క్యాల్షియం ఉండడం లేదు అంటే కాల్షియం విటమిన్-డి సప్లిమెంట్ ని ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు ఉండడం ఇలా వివిధ కారణాల వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అని నిపుణులు అంటున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వంటింటి చిట్కాలతో ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్పడం జరిగింది. అయితే మరి ఆ రెమిడీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే అలోవెరా జ్యూస్ తాగితే సెట్ అయిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు అని అన్నారు.
అదే విధంగా ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్థాలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలానే ఖాళీకడుపుతో దానిమ్మ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు నివారణకు సహాయపడుతుంది.
నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని దానిలో తేనె కాని బెల్లం కానీ కలుపుకుని ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం తీసుకుంటే కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి.
పుచ్చకాయ జ్యూస్ లేదా పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. అలానే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే కొద్దిగా నిమ్మరసంలో సైంధవలవణం కలుపుకుని తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఇలా ఈ విధంగా కనుక మీరు రెగ్యులర్ గా చేస్తే తప్పకుండా కిడ్నీ స్టోన్స్ సమస్య ఉండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అదే విధంగా రోజూ కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగేటట్టు చూసుకోండి.