తులసి ఆకులను వీళ్లు అస్సలు తినకూడదట.. రోజు తింటే మగవారికి ఆ సమస్య వచ్చే ప్రమాదం ఉంది..!

-

తులసి ఆకులు ఎన్నో ఔషధ గుణాలుంటాయని మనందరికి తెలుసు..క్యాన్సర్ భారిన పడుకుండా ఉండాలంటే..డైలీ రెండు మూడలు ఆకులను నమలాలని, నోటి దుర్వాస పోవటానికి కూడా తులసి ఆకులు బాగా ఉపయోగపడతాయని ఇలా చాలా చెప్తుంటారు కదూ. కానీ తులసి ఆకులు తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా. రోగనిరోధక శక్తిని పెంచుకోవటంలో తులసి ఉపయోగప‍డుతుంది…కానీ కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా తులసి కారణమవుతుంది.

తులసి ఆకుల్లో పాదరసం ఉంటుంది. దాన్ని నమిలినప్పుడు ఈ మూలకాలు బయటకు వస్తాయట. అది దంతాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. తులసి ఆకులు ఆమ్లంగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు నమలడం వల్ల పంటి ఎనామిల్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. తులసి తినడం వల్ల దంతాల్లో సున్నితత్వం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అదేపనిగా తులసి ఆకులను తినకూడదు.

తులసిని సరైన మొత్తంలో తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుందట. ఎన్‌సీబీఐ నివేదిక ప్రకారం తులసి ఆకుల్లో సంతానోత్పత్తి నిరోధక లక్షణాలు ఉన్నాయట. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు.. మీరు తులసి ఆకులను ఎక్కువగా తింటే, అది స్పెర్మ్‌ కౌంట్‌ను ప్రభావితం చేస్తుంది.

గర్భిణీలు, పాలిచ్చే మహిళలు కూడా నిపుణుల సలహా మేరకు మాత్రమే తులసి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.. సలహా లేకుండా తులసి ఆకులను తినడం కూడా ఆరోగ్యానికి హానికరమే. డయాబెటీస్ కి‌ మందులు వాడుతున్నట్లయితే తులసి ఆకులను అస్సలు తినవద్దు. తులసి ఆకుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. కానీ, ఏదైనా ఔషధం తీసుకుంటే మాత్రం నిపుణుల అభిప్రాయం తీసుకోవాల్సిందే.

ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకుల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉంది. అయితే, రక్తం గడ్డకట్టే సమస్య లేకుంటే, బ్లడ్‌థినర్స్‌ తీసుకుంటే తులసి ఆకులను ఎక్కువగా తీసుకోకండి. దీంతో రక్తం పల్చగా మారవచ్చు. తులసి ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. డయాబెటిక్‌ పేషెంట్‌ మందులు వేసుకుని తులసి ఆకులను తీసుకుంటే శరీరంలో అధిక చక్కెర తగ్గి హానికరం అవ్వొచ్చు. ఒకవేళ మందులు వాడని వారైతే ఓ సారి వైద్యులను సంప్రదించి అప్పుడు తులసి ఆకులనే ఔషధంగా తినవచ్చు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version