తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

-

జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్‌‌ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ కార్పోరేటర్లు పట్టుబట్టారు. లేనియెడల మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళంగా మారింది. బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ ఎంత చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.

మేయర్ రాజీనామాకు పట్టుబట్టి ఆమె పోడియంను చుట్టుముట్టారు.గ్రేటర్‌ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ హామీలపై జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ నిలదీశారు. అతని చేతిలోని ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు లాక్కుని చించివేశారు.దీంతో ఉద్రిక్తత చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ నుంచి కార్పొరేటర్లను బయటకు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version