క‌రివేపాకుతో మొటిమ‌ల‌కు చెక్ పెట్టండిలా..

-

క‌రివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం అంద‌రికి తెలిసందే. ముఖ్యంగా కంటి చూపు మెరుగుప‌ర‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అయితే క‌రివేపాకు వంట‌ల‌కే కాదు అందానికి కూడా ఉప‌యోగిస్తారు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి.

కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. ముఖంపై మొటిమ‌లు, మచ్చలు పోగొట్టడంలో క‌రివేపాకు ఔషధంగా పనిచేస్తుంది. మ‌రి క‌రివేపాకును ఎలా ఉప‌యోగించాలో చాలా మందికి తెలియ‌దు. అలాంటి వారు ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..

– క‌రివేపాకు బాగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా ప‌సుపు, నిమ్మ‌ర‌సం క‌లిపి ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ముఖంపై మొటిమ‌ల, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.

– కరివేపాకు పేస్ట్‌లో ఆలివ్ నూనెను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

– క‌రిపేపాకు పేస్ట్‌లో కొద్దిగా రోజ్ వాట‌ర్ మ‌రియు ముల్తానీ మ‌ట్టి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు త‌గ్గుతాయి.

– క‌రివేపాకు పేస్ట్‌లో నిమ్మ ర‌సం క‌లిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల నుంచి ఉప‌శ‌మం పొంద‌వ‌చ్చు.

– క‌రివేపాకు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు, నిమ్మ‌రసం క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకుంటే మొటిమ‌లు త‌గ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version