హెలో బొగ్గే కదా అని పారేయకండి… తెలిస్తే మీరే వదిలిపెట్టరులే…!

-

బొగ్గు అనేది చాలా మందికి చూడటానికి చిరాకుగా ఉంటుంది కదా…? కాని బొగ్గు అనేది మొహానికి పూస్తే కలర్ వస్తార౦ట. ఇంటి వద్ద దొరికే బొగ్గుతో ఫేస్‌క్రీమ్‌ తయారు చేసుకోవచ్చుని అంటున్నారు. ఎలా అంటారా…? ఇది చదవండి అయితే. బొగ్గును మెత్తగా నూరి… హెన్నా టైపులో ముఖానికి పూసి, తర్వాత శుభ్రం చెయ్యాలి. ఇలా 8 రోజులు ఇలా చేయడం వల్ల క్రమంగా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

ఈ రోజుల్లో కాలుష్యంలో ఉండే వాళ్లకు ముఖంపై రంధ్రాలు మరింత పెద్దవిగా కనపడతాయి కాబట్టి వాళ్ళు ఫేస్‌మాస్క్‌లో కొద్దిగా బొగ్గుపొడిని ఉపయోగిస్తే అది మృతకణాలను తొలగించి, మురికి బయటకు వచ్చేలా చేస్తుందట. అంతే కాదు, పళ్లు పచ్చగా కనపడితే, కొంచెం బొగ్గు పొడి తీసుకుని, వంటసోడా కలిపి ఈ మిశ్రమంతో పళ్లు తోముకుంటే… ఇలా వారానికోసారి చేస్తుంటే పళ్లు ముత్యాల్లా మారుతాయని అంటున్నారు.

వేసవి కాలం వస్తే చాలు చాలామందిని జిడ్డు చర్మం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇందుకోసం ఎన్నో క్రీములు వాడుతూ, వైద్యులు చుట్టూ, పార్లర్ల చుట్టూ తిరుగుతారు. కాని ఇలాంటివారు బొగ్గు మాస్క్‌ను ఉపయోగిస్తే అతిగా చర్మం నుంచి విడుదలవుతున్న నూనెలు తొలగిపోతాయట. ఇలా చేస్తే కచ్చితంగా చర్మం మృదువుగా కనిపిస్తుందని అంటున్నారు. ఇలా చేస్తే సహజనూనెలు కోల్పోకుండా ఉంటాయని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news